Tuesday, 28 July 2026 10:08:35 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

మాండ్ర.శివానందా రెడ్డి 66 వ జన్మదినం సందర్భంగా డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Date : 18 July 2026 08:25 PM Views : 58

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇంచార్జీ మాండ్ర. శివానందా రెడ్డి 66 వ జన్మదినం సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆధ్వర్యంలో ముందస్తుగా ఆత్మకూరు మండలములోని, కరివేన గ్రామంలో ఉన్న ఎస్సార్బీసీ కాలనీ నందు గల మానవతా నిలయం( వృద్ధాశ్రమంలో) అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాములపాడు సబ్ ఇనస్పెక్టర్ పి.తిరుపాలు పాల్గొని, వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, పాములపాడు ఎస్ఐ పి.తిరుపాలు, తదితరులు మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందా రెడ్డి నందికొట్కూరు నియోజక వర్గంలో అభివృద్ధి కోసం పాటుపడే వారని, నియోజక వర్గ ప్రజలు శ్రేయస్సు కోరుకూని వీరు, కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నందికొట్కూరు ను నందనవనంగా మారుస్తున్న ఆయన మంచి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, భవిష్యత్తులో పార్టీ పదవులు మరిన్ని అలంకరించి ప్రజలకు సేవచేయాలని, నియోజక వర్గ ప్రజలు నిండుమనసుతో ఆయనను ఆశీర్వదించాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల తెలుగు యువత అధ్యక్షుడు రుద్రవరం షేక్.కరీం బాష, ఏబీఎన్ పాలెం టీడీపీ నాయకులు కాటేపోగు నాగ సురేష్, తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు విక్రమ్ గౌడ్, మిట్టకందాల నాయకులు లింగాల శివరాముడు, లింగాల అబ్రహం, శివ రాజు, లింగాల దేవ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :