Friday, 11 September 2026 10:13:38 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలనీ ఏడి, ఆర్డీవో ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహించిన ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు

Date : 22 August 2026 08:05 PM Views : 132

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు, కొత్తపల్లె, పాములపాడు, వెలుగోడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను వ్యవసాయ కూలీలను కౌలు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు అగ్రికల్చర్ ఏడి మరియు ఆర్డీవో ఆఫీస్ ల ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ.రాజశేఖర్, టి.రామచంద్రుడు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.స్వాములు, కృషి పండ్ల తోటల సంఘం అధ్యక్షులు బి.మహబూబ్ బాషా లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అతివృష్టి అనావృష్టి వల్ల రైతుల అప్పులు చేసి పంటలు సాగు చేసి నష్టపో నష్టపోయారన్నారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోయాయి పాత పులకు కొత్త అప్పులు తోడై రైతులు ఆత్మహత్య లు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మన జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 53 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని అధికారులు ప్రకటించారు. ఆత్మకూరు, కొత్తపల్లి , పాములపాడు, వెలుగోడు మండలాలలో పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొన్నాయనీ, వ్యవసాయ కూలీలకు పనులు పనులు లేవు కనీసం ఉపాధి పనులు కూడా కల్పించడం లేదు అని ఆరోపించారు. ప్రభుత్వం పంటల బీమా చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల దాదాపు 14000 కోట్ల రూపాయలు ఇప్పటికే బీమా ప్రీమియం చెల్లించారు. గత సంవత్సరంలో భీమా కంపెనీలు రైతుల నుండి ప్రీమియం వసూలు చేయడం తప్ప రైతులకు చెల్లించింది ఏమీ లేదు కరువు మండలాలుగా ప్రకటించినట్లయితే రైతులకు బీమా పరిహారం అందుతుందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో కరువు మండలాలుగా ప్రకటిస్తారని ఆశించామని కానీ ఈ సమావేశాలలో ఆ ప్రస్తావనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతులకు బీమా పరిహారంతో పాటు అన్ని రకాల అప్పులను రద్దు చేయాలని, కరువు కూపన్ల ద్వారా పేదలకు ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు ఉచితంగా అందించి ఆదుకోవాలని,ప్రతి మండల కేంద్రంలో గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేసి పశువులకు గ్రాసం కొరత లేకుండా చర్యలు చేపట్టాలని, ఉపాధి కూలీలకు 250 రోజులు పని దినాలు కనిపించాలని, అన్ని రకాల పంటలకు బీమా వర్తింపజేయాలని భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు నేరుగా పరిహారం అందించాలని, రెండు లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం అనంతరం అగ్రికల్చర్ ఏడి, ఆర్డిఓ ల కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెలిమిళ్ళ గ్రామ మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి, రైతు సంఘం పాములపాడు మండల అధ్యక్షులు కోట్ల.నాగేశ్వర్ రెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు డి.స్వామన్న, రైతు సంఘం కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు, గుంతకందాల మాజీ సర్పంచ్ శివన్న, వెలుగోడు రైతు సంఘం అధ్యక్షులు గోవిందు, రైతు సంఘం ఆత్మకూరు కార్యదర్శి వీరన్న, కొత్తపల్లి మండల కార్యదర్శి సంజీవ రాయుడు, వెంకటేశ్వర్లు, కృష్ణుడు, వెంకటేశ్వర గౌడ్, గోపాల్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కే.దినేష్, ఏసన్న, అంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :