ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లాలో ఈరోజు పాడి పశువులకు త్రాగునీటి అవసరాల కోసం, జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల రైతుల అవసరాల కోసం మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా రెండు పంపులు ఆన్ చేసి, కేసీ.కెనాల్ కు నీరు వదలాలని కోరుతూ పాములపాడు మండల రైతు సంఘం అధ్యక్షుడు, కేసీ కెనాల్ చైర్మన్ మద్దూరు జి.తిమ్మారెడ్డి, డీసీ చైర్మన్ కట్ట పరమేశ్వర్ రెడ్డి,రైతులతో కలిసి వినతి పత్రాన్ని గిత్త.జయాసూర్య సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య మాట్లాడుతూ సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ తో చర్చిస్తామని ఆమె ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి.గోపికృష్ణ,, తదితర అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News