Tuesday, 28 July 2026 05:32:27 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ప్రభుత్వం పదో తరగతి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలి

Date : 20 November 2025 09:06 PM Views : 1097

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో లేకుండా, కేవలం పాఠశాల పనిదినాల్లో మాత్రమే నిర్వహించాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్. చాంద్ బాష లు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నంద్యాల జిల్లా, వెలుగోడు మండలంలోని, అన్ని గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత, మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష లు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, ఆ విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి. పదోన్నతులు కల్పించాలని, టెట్ నుంచి మినహాయింపు కోసం, విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐ.ఆర్. మధ్యంతర భృతి ఇవ్వాలని, జి ఆర్-11 హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్ (సబ్జెక్ట్, లాంగ్వేజ్ & స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టుకు ఎస్జీటీ లకు పదోన్నతులు కల్పించాలని, 2025 బదిలీల్లో బదిలీ అయ్యి రిలీవర్ లేక పాత స్థానాల్లో కొనసాగే వారిని రిలీవర్ తో సంబంధం లేకుండా రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు వెలుగోడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ మొయినుద్దీన్, అబ్దుల్ అహద్, రాష్ట్ర నాయకులు పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్ జిల్లా నాయకులు మహేష్, మునిరెడ్డి, బాపూజీ నాయక్, మోమిన్ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి తగిన ప్రాతినిధ్యం వహిస్తామని స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: