Sunday, 13 September 2026 12:57:41 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

మంచి ఆలోచనలతో ఆదాయం పొందే మార్గాల‌కు దిశానిర్దేశం చేయాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 14 February 2026 10:14 PM Views : 202

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం, విజ‌య‌వాడ కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన, నైపుణ్య వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఇలాంటి కార్య‌క్రమాల‌ను స‌ద్వినియోగం చేసుకొని ప్ర‌తి మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌గా ఎద‌గాల‌ని అన్నారు. మ‌హిళామ‌ణుల‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దేందుకు జిల్లా ప‌రిశ్ర‌మ‌లు, డీఆర్‌డీఏ త‌దిత‌ర శాఖ‌ల‌తో పాటు కూలెక్స్ ఇండ‌స్ట్రీస్ భాగ‌స్వామ్యంతో శ‌నివారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లంలోని, గుంటుప‌ల్లిలో ఉన్న రూర‌ల్ ఇంక్యుబేష‌న్‌, స్కిల్లింగ్ అండ్ ఆంత్ర‌ప్రెన్యూర్‌షిప్ సెంట‌ర్ (రైజ్‌)లో ప్ర‌త్యేక జాగృతి వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శీత‌లీక‌ర‌ణ‌, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్‌మెంట్ త‌యారీలో సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన కూలెక్స్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమానులు సూక్ష్మ‌, చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు విలువ ఆధారిత ఉత్ప‌త్తులు, చిన్న‌స్థాయి వ్యాపార అభివృద్ధికి ప్ర‌యోజ‌నం క‌ల్పించేలా శిక్ష‌ణ అందించారు. ఫ్ర‌య‌ర్స్‌, పిజ్జా ఓవెన్స్‌, శాండ్‌విచ్‌గ్రిల్స్‌, వాఫెల్ మెషీన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ గ్రైడ‌ర్స్ త‌దిత‌రాల‌పై లైవ్ డెమో ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఆహార ఉత్ప‌త్తుల వ్యాపారం చాలా లాభ‌దాయ‌క‌మ‌ని.. అయితే ఉత్ప‌త్తుల‌ను అత్యంత ప‌రిశుభ్ర‌త‌తో నాణ్య‌త‌తో అందించిన‌ప్పుడే వినియోగ‌దారుల ఆద‌ర‌ణ ఉంటుంద‌న్నారు. అందుకే ఇలాంటి అధునాత‌న, వినూత్న మెషీన్లు ఉప‌యోగించ‌డం ద్వారా దీర్ఘ‌కాలం పాటు వ్యాపారాన్ని విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చ‌న్నారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త క‌ల‌ను సాకారం చేసేందుకు ప్ర‌తివారం రైజ్ కేంద్రంలో ప్ర‌త్యేక వ‌ర్క్‌షాపులు నిర్వ‌హిస్తున్నామ‌ని.. మ‌హిళ‌లు వీటిని స‌ద్వినియోగం చేసుకొని స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకొని పారిశ్రామికవేత్తలుగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. *రైజ్‌.. హెల్పింగ్ హ్యాండ్‌:* మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తే కుటుంబం, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలు తమ ప్రతిభ, ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు రైజ్ వంటి వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ రైజ్ కేంద్రంలో వ‌రుస‌గా ఇది నాలుగో వ‌ర్క్‌షాప్ అని.. ఇలాంటి మ‌రిన్ని వ‌ర్క్‌షాప్‌లు నిరంత‌రం జ‌రుగుతూనే ఉంటాయ‌న్నారు. పాఠాలు నేర్చుకోవాలంటే బ‌డికి వెళ్లాలి.. దేవుని ద‌ర్శ‌నం కోసం ఆల‌యానికి వెళ్లాలి.. పారిశ్రామిక‌వేత్త‌గా ఎద‌గాలంటే రైజ్ కేంద్రానికి వెళ్లాలంటూ మ‌హిళామ‌ణుల్లో స్ఫూర్తి నింపారు. మంచి ఆలోచ‌న‌లు ఆదాయ మార్గాలుగా మారేలా రైజ్ చేయిప‌ట్టి న‌డిపిస్తుంద‌ని, ఆర్థిక సాధికార‌త‌ను సొంతం చేస్తుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. *ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి:* మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న పీఎంఈజీపీ వంటి ప‌థ‌కాల‌తో పాటు వివిధ రుణ సదుపాయాలు, సబ్సిడీలు, శిక్షణా కార్యక్రమాలు, మార్కెటింగ్ మద్దతు పథకాలపై జిల్లా పారిశ్రామిక అధికారి వివ‌రించారు. బ్యాంకు రుణాల ప్రక్రియ, డాక్యుమెంటేషన్, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక మద్దతు పొందే విధానం వంటి అంశాలపై స్పష్టత ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు యూనిట్ స్థాపనలో ఎదురయ్యే సమస్యలు, వినూత్న ప‌రిక‌రాల వినియోగం, నిర్వ‌హ‌ణ‌, ముడి సరుకు అందుబాటు, మార్కెటింగ్ సవాళ్లు వంటి అంశాలపై నిపుణులతో చర్చించారు. ప్రత్యక్షంగా తమ సందేహాలకు సమాధానాలు పొందడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కొంతమంది మహిళలు త్వరలోనే ఆహార ఉత్ప‌త్తుల త‌యారీ యూనిట్లు ప్రారంభించేందుకు ఆసక్తి వ్యక్తం చేయడం, రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌డం ఈ వర్క్‌షాప్ విజయానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీపీ పాల‌డుగు జ్యోత్స్న‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, కూలెక్స్ ఇండ‌స్ట్రీస్ యాజ‌మానులు పాల‌కుర్తి రాధాకృష్ణ‌, భ్ర‌మ‌రాంబ‌, సందేశ్‌, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి ఎం.మ‌ధు, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, ఇబ్ర‌హీంప‌ట్నం బ్లాక్ కోఆర్డినేట‌ర్ శ్రీనివాస‌రావు, మ‌హిళా స‌మాఖ్య‌ల ప్ర‌తినిధులు, పెద్ద సంఖ్య‌లో స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌, ఔత్సాహిక మ‌హిళ‌లు హాజ‌ర‌య్యారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :