Sunday, 13 September 2026 12:56:38 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్- ప్రజాస్వామ్యంపై దాడి :- తేనే నాగరాజు

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల భారీ ఆందోళన కార్యక్రమం

Date : 23 July 2026 06:49 PM Views : 105

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తేనే నాగరాజు నాయకత్వంలో సుమారు 200 మంది విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం పటేల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో తేనే నాగరాజు మాట్లాడుతూ 10సంవత్సరాలనుండి 152సార్లు నీట్, ఐఐటీ. పేపర్స్ లీక్ అయ్యాయాని, దేశంలో వున్నా 7.5కోట్ల మంది విద్యార్థుల అన్యాయం జరిగిందని, నీట్ పరీక్ష సీటు 40లక్షకు, ఐఐటీ సిట్ 15లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయనీ, దీనికి కారణంమైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామ చేసి, దేశ ప్రజలకు, రాహుల్ గాంధీ కి క్షమాపణలు చెప్పాలనీ, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, ప్రతిపక్షాల గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని, బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని అన్నారు. పోలీస్ ల వేషంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండా మూకలు దాడి చేయడం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, వెంటనే కాంగ్రెస్ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని నిర్బంధాల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఆందోళనలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సికిందర్, మౌలాలి, జూపాడు బంగ్లా, పాములపాడు మండల అధ్యక్షులు ఎస్. షేక్షాఅలీ, ఎంపీ మద్దిలేటి, చాంద్ బాషా, సుంకన్న, మోహన్, ఇంతియాజ్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: