ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మున్సిపాలిటీలోని, ఇస్లాంపేట ఆరవ వార్డులో మజీద్ అత్తాయి రసూల్ కు నూతన రోడ్డు నిర్మాణానికి వార్డ్ కౌన్సిలర్ ముఫ్తి నూర్ మొహమ్మద్, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ రషీద్, వెన్న శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ ఏఈ షాహిద్, ముస్లిం మత పెద్దలతో కలిసి దువా చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరో వార్డు కౌన్సిలర్ ముఫ్తి నూర్ మొహమ్మద్ మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, అభివృద్ధి పనులు చేయడానికి అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ ఆతాయి రసూల్ ముతవల్లి సుల్తాన్, గౌస్ పీరా, మజీద్ కమిటీ సభ్యులు, వార్డులోని ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News