Monday, 14 September 2026 01:04:09 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఇష్ట‌ప‌డి చ‌దువుతూ ఉన్న‌త‌ స్థానాల‌కు ఎద‌గండి

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌

Date : 08 February 2026 07:57 AM Views : 120

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : అబ్దుల్ క‌లాం వంటి మహనీయుల స్ఫూర్తి పథంలో నడుచుకుంటూ విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాలని ఆయన విద్యార్థుల‌కు సూచించారు. శ‌నివారం కొండపల్లి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల 36వ వార్షికోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌, మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌తో క‌లిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి పాఠశాల మైదానంలో విద్యార్థినుల ప్రత్యేక ప‌రేడ్ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ప్ర‌పంచంలో స‌గ‌ర్వంగా నిలిచిందంటే అందుకు అబ్దుల్ క‌లాం వంటి మ‌హ‌నీయుల కృషే కార‌ణ‌మ‌న్నారు. స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ ల‌క్ష్యాన్ని సాధించేందుకు ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా వెన‌క్కు త‌గ్గ‌కూడ‌ద‌న్నారు. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాట‌ల‌ను స‌రైన విధంగా అర్థం చేసుకుంటూ ముంద‌డుగు వేయాల‌న్నారు. విద్యార్థి ద‌శ‌లో ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రేర‌ణ కార‌ణంగానే ఈ స్థాయిలో నిలిచాన‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ప‌టిష్టంగా అమ‌లుచేస్తోంద‌ని దీన్ని స‌ద్వినియోగం చేసుకొని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు సాధించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకొనే ఎంద‌రో గొప్ప‌వార‌య్యార‌ని విద్యార్థులు ప‌ట్టుద‌ల‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చ‌దువుకొని జీవితంలో ఉన్న‌త‌స్థానాల‌కు ఎద‌గాల‌ని మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ అన్నారు. మ‌న జిల్లా క‌లెక్ట‌ర్ కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనే చ‌దువుకొని ఈస్థాయికి చేరుకున్నార‌న్నారు. ఇలాంటివారిని స్ఫూర్తిగా తీసుకొని క‌ష్ట‌ప‌డి చ‌దివి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు తెచ్చుకోవాల‌ని సూచించారు. కొండ‌ప‌ల్లి బాలిక‌ల జెడ్‌పీ హైస్కూల్ అభివృద్ధిపై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌తో పాటు మైదానం అభివృద్ధికీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు ఉప‌కార‌వేత‌నాలు కూడా అందిస్తామ‌ని వెల్ల‌డించారు. చిన్నారులు విద్య‌తో పాటు నైతిక విలువ‌లు పెంపొందించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఈ దిశ‌గా విద్యాబోధ‌న జ‌ర‌గాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ప్ర‌భుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. ప్ర‌భుత్వం అందిస్తున్న పుస్త‌కాలు, యూనిఫామ్‌, నాణ్య‌మైన మధ్యాహ్న భోజ‌నం, మౌలిక వ‌స‌తులను స‌ద్వినియోగం చేసుకొని బాగా చ‌దువుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ చిన్నారుల‌కు సూచించారు. విద్యార్థినుల మార్చ్‌ ఫాస్ట్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌జా ప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. విద్యార్థినులకు శాస‌న‌స‌భ్యులు సమకూర్చిన క్రీడా సామగ్రిని పరిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌, కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ ఛైర్మ‌న్ సీహెచ్ చిట్టిబాబు, ఎంపీపీ పి.జ్యోత్స్న‌, హెచ్ఎం-హేమ‌ల‌త‌, స్థానిక పెద్ద‌లు ఎ.రామ‌మోహ‌న‌రావు (గాంధీ), స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఎస్ఎంసీ ప్ర‌తినిధులు, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: