ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, పాములపాడు మండల కేంద్రంలో జనవరి- 9, 10వ తేదీలలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయడానికి సంఘం ఆధ్వర్యంలో ఆహ్వాన సంఘ సమావేశం మండల కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శివ నాగరాణి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కోసం అనేక పోరాటాలు చేసి వారికోసం గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఇతర స్థానిక సమస్యలు పోరాడి సాధించడం జరిగింది. నేటికీ పాలక ప్రభుత్వాలు కూలీల పట్ల అనేక రకాలుగా వివక్ష చూపుతూ, పేదలకు ఇచ్చిన భూములను లాక్కుంటూ అలాగే ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ అనేక ఇబ్బందులు పెడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన విధానాలను అనుసరిస్తుందని వాటిని వెంటనే విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ పరిశ్రమల కోసం పేదల భూములు లాక్కుంటుందని వారికి తగిన నష్టపరిహారం కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. రాబోవు కాలంలో పేదల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభలో జయప్రదం కోసం ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా ఆర్.ఎస్.గోపాల్, అధ్యక్షుడుగా కోట్ల.చంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులుగా బత్తుల.సంజీవరాయుడు, ఎస్.షేక్షాఅలి, వీరితోపాటు 35 మందితో కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయక్ ,ఎం.సుధాకర్, బాలయ్య ,స్వాములు, డేవిడ్, ఓబులేసు, ఈశ్వరమ్మ, మధు శేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు- డి.స్వామన్న, రజక వృత్తి సంఘం సి.వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు ఏ.రణదీర్, రామ నాయక్, శివ లక్ష్మమ్మ, కె వి పి ఎస్ జిల్లా నాయకులు జయరాణి, మహిళా సంఘం నాయకురాలు రవణమ్మ ,అలాగే మండల పరిధిలోని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
E Nivas News