ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : జనవరి 4న కర్నూలు నగరంలోని , జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగే వడ్డెర హక్కుల సాధన సదస్సును విజయవంతం చేయాలని ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని రైతునగరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య మాట్లాడుతూ వడ్డెరులను ఎస్టీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని అన్నారు. గత ఎన్నికల ముందు వడ్డెరులకు ఇచ్చిన హమీలను కూటమి ప్రభుత్వం నేరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు,పాములపాడు, వెలుగోడు,శిరివెళ్ల, గోస్పాడు మండలాల్లో సదస్సుకు వడ్డెరులు తరలిరావాలని ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చే బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్ కు పంపాలని కోరారు.వడ్డెరుల డిమాండ్ల సాధనకై నిర్వహించే సదస్సుకు వేలాదిగా వడ్డెరులు తరలిరావాలని సూచించారు. వడ్డెరుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. వడ్డెరులు ఐక్యమత్యంతో మెలగాలని సూచించారు. వడ్డెరులకు మైనింగ్ పై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాయల్టీ నుంచి వడ్డెరులకు మినహాయింపు ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Admin
E Nivas News