ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల పట్టణంలోని, ఆయన కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ను రుద్రవరం గ్రామ టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం చేతికి అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ బాష రాష్ట్రంలోని మసీదుల ఇమాములకు, మోజాన్లకు వేతనాలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు, రాష్ట్రమంత్రి ఎన్ఎండి.ఫరూక్ కు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్-ం మౌలానా ముస్తాక్ అహ్మద్ కు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. వెనుకబడిన మా ముస్లిం మైనార్టీలకు ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చైర్మన్ నీ కోరారు.
Admin
E Nivas News