Friday, 11 September 2026 10:18:14 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం:-సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

Date : 15 August 2026 09:42 PM Views : 79

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు గునుపాటి భాస్కర్, ఆత్మకూరు అర్బన్ ,రూరల్ అధ్యక్షులు వేణుగోపాల్ , రవీంద్ర బాబు తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దిన్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు శంకర్, దినకర్ రావు తోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. *ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం* నందు శ్రీశైలం నియోజకవర్గ నాయకులు వై.యుగంధర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్ తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్ధిన్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. వీరి వెంట డైరెక్టర్ ప్రవీణ్, రైతులు వీరారెడ్డి, శంకర్ రెడ్డి, శంషుద్దీన్ , ఖాజామియా, సిబ్బంది రియాజ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా *ఆత్మకూరు బాలికల ఉన్నత పాఠశాల* నందు విద్యా కమిటీ చైర్మన్ ఖాజావలి, ప్రధాన ఉపాధ్యాయురాలు జి.ఉమారాణి, సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మరియు వేణుగోపాల్ తో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు, స్థానిక నాయకులు అమృల్లా, శ్రీను, అబ్దుల్ రజాక్, మొహమ్మద్, మాభాష తదితరులు పాల్గొన్నారు. *ఆత్మకూరు నలంద హైస్కూల్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు* నలంద హైస్కూల్ కరస్పాండెంట్ ఎం వి. చలపతి తో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్ధిన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా మన దేశ ఐక్యతను చాటే అతి పెద్ద పండుగ పంద్రాగస్టు వేడుక అని అన్నారు. మనమందరం దేశభక్తితో సరికొత్త స్ఫూర్తితో ఈ పండుగను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిఇఓ బి. సుమతి, జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు చందా రమణయ్య, హెడ్మాస్టర్ సందయ్య, ఉపాధ్యాయ, ఉపాధ్యాయురాలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :