Tuesday, 15 September 2026 09:15:37 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బాల్య వివాహ ర‌హిత స‌మాజ నిర్మాణానికి కృషిచేద్దాం

Date : 03 February 2026 12:30 AM Views : 136

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : పిల్ల‌ల బంగారు భ‌విష్య‌త్తుకు చేయీచేయీ కలపి బాల్య వివాహ ర‌హిత జిల్లాగా ఎన్‌టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆద‌ర్శంగా నిల‌ప‌డంలో ప్ర‌తిఒక్క‌రూ చేయీచేయీ క‌ల‌పాల‌ని, పిల్ల‌ల‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు నిబ‌ద్ధ‌త‌తో కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. వాస‌వ్య మ‌హిళా మండ‌లి (వీఎంఎం) - బాల్య వివాహ విముక్తి ర‌థాన్ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా సంత‌కం చేసి విస్తృత ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ సామాజిక బాధ్య‌త‌గా వాస‌వ్య మ‌హిళా మండ‌లి ఓ మంచి కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతోంద‌న్నారు. వ‌సుధైవ కుటుంబంలో భాగ‌మైన మనంద‌రం బాల్య వివాహాల వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించి, బాల్య వివాహాలు జ‌ర‌క్కుండా క‌లిసిక‌ట్టుగా కృషిచేయాల్సి ఉంద‌న్నారు. చ‌ట్టాల‌ను గౌర‌విస్తూ, నిబంధ‌న‌లు పాటిస్తూ బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఈ ప్ర‌చార ర‌థం ద్వారా గ్రామీణ‌, ప‌ట్టణ ప్రాంతాల్లో బాల్య వివాహాల దుష్ప‌రిణామాలు, చ‌ట్టాలుపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. చైల్డ్ హెల్ప్‌లైన్ (1098), ఉమెన్ హెల్ప్‌లైన్ (181) కూడా అందుబాటులో ఉన్నాయ‌ని.. ఎవ‌రైనా ఈ నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించ‌వ‌చ్చ‌న్నారు. ఈ ప్ర‌చార ర‌థం ద్వారా బాల్య వివాహాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు ల‌క్ష మందికి పైగా ప్ర‌జ‌ల నుంచి సంత‌కాలు సేక‌రించాల‌ని, ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వాస‌వ్య మ‌హిళా మండ‌లి బృందానికి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో వాస‌వ్య మ‌హిళా మండ‌లి ప్రెసిడెంట్ డాక్టర్ బి.కీర్తి, ప్రాజెక్టు డైరెక్ట‌ర్ రామానుజ‌య‌, జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ ఎం.రాజేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :