Sunday, 13 September 2026 01:13:29 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

గ్రామాలలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలి

బిజెపి "జనతా వారధి" కార్యక్రమంలో భాగంగా పిజిఆర్ఎస్ లో వినతి పత్రాలు

Date : 03 March 2026 08:24 AM Views : 214

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ కోరారు. భారతీయ జనతా పార్టీ “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా సోమవారం పీజీఆర్ఎస్ లో తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్ లకు మండలంలోని, గ్రామాల్లో తాగునీటి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ వేంపెంట, మిట్టకందాల, తుమ్మలూరు, పాములపాడు మరియు పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సమస్య లేకుండా చేయాలని, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని తెలిపారు. వేంపెంట గ్రామంలోని, శ్రీరామ్ నగర్ లో గత కొన్ని నెలలుగా తాగునీరు బోరింగ్ పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తాగునీటి బావిలో చెత్తాచెదారం చేరడంతో నీరు వాడుకోవడం లేదని, బోర్లు వేశారు కానీ బోరింగ్ సెట్టింగ్ బిగించలేదు. కృష్ణారావుపేటలోని, దళిత వాడలో గల బోరింగ్ గత కొన్ని నెలలుగా శిథిలవస్తులకు చేరింది. ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు. మిట్టకందాల గ్రామంలో బోరు వేశారు కానీ కుళాయిలు బిగించలేదు. బోరింగ్ సెట్టింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కువగా నీరు వృధా అవుతూ వృధా అయిన నీరు వీధుల వెంట ప్రవహిస్తూ దుర్వాసనతో దోమలు ఏర్పడి రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ వద్ద బోరింగ్ మరమ్మతులకు నోచుకోక నీళ్లు రావడం లేదు. బోరింగ్ చుట్టూ చెత్తాచెదారులతో దుర్వాసన విరజుల్లుతుందని తెలిపారు. వేసవిలో గ్రామాలలో తాగునీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు గోపాలకృష్ణయ్య,, ప్రవీణ్, గోపాల్, బాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :