Thursday, 30 July 2026 02:28:57 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

1999-2000 సంవత్సరానికి చెందిన 10వ తరగతి జడ్పీ హైస్కూలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం....! విద్య నేర్పిన గురువులకు ఘన సన్మానం చేసిన పూర్వ విద్యార్థులు

25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనానికి తరలివచ్చి పాల్గొన్న పూర్వ విద్యార్థులు

Date : 14 December 2025 08:16 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999 -2000 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వంగా కలుసుకున్నారు. ముందుగా పూర్వ విద్యార్థులు బాణాసంచా కాల్చుతూ బాజా, భజంత్రీలతో పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి పాఠశాల వరకు పాదయాత్ర చేశారు. అనంతరం సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులచే జ్యోతి ప్రజ్వలన చేయించారు. వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బయ్య, రంగారెడ్డి, సత్యనారాయణ ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు మక్బుల్ భాష, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, శివకుమార్, ఈశ్వరయ్య, సుదర్శనం, మహమ్మద్ ఇక్బాల్, రాజు, రవి శంకర్ శర్మ, రామకృష్ణ, నర్సింహులు, తదితరులు మాట్లాడుతూ, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో అన్న సినీ గేయం ఈ విద్యార్థులకు సరిపోతుందన్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పాఠాలు చెప్పిన గురువులను, చదువుకున్న పాఠశాలను, పుట్టిన ఊరుని ఎప్పటికీ మరువరాదు అన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదు అన్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి భారత దేశంలోని నలుమూలల నుండి తమ మిత్రబృందాన్ని కలుసుకోవడానికి పూర్వ విద్యార్థులు తరలి వచ్చారు.మిత్ర బృందం ఒకరినొకరు పరిచయం చేసుకొని ఆనందంగా కలుసుకొని చదువుకున్న పాఠశాలలో కలియ తిరిగారు. మిత్ర బృందం తాము చదువుకున్న సమయంలో చేసిన అల్లర్లు ఉపాధ్యాయులచే తిన్న తిట్లు, దెబ్బలను గుర్తు చేసుకుంటూ ఆనంద లోకంలో మునిగిపోయారు.అనంతరం పాఠాలు నేర్పిన గురువులకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, మెమొంటోలు బహుకరించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. తదుపరి మిత్ర బృందానికి మెమొంటోలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు జయరామిరెడ్డి, సుల్తాన్ మొహిద్దిన్ లతోపాటు మరియు 1999- 2000 మిత్రబృందం, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: