Tuesday, 28 July 2026 09:30:46 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

బాధిత మహిళలకు గౌరవం, న్యాయం కల్పించేందుకు ఈ సెంటర్

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 04 February 2026 09:23 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : వ‌న్ స్టాప్ సెంట‌ర్లు (ఓఎస్‌సీ).. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నాయ‌ని.. బాధిత మ‌హిళ‌ల‌కు గౌర‌వం, న్యాయం క‌ల్పించేందుకు కృషిచేస్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఇగ్నైట్ సెల్‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. సఖి వన్ స్టాప్ సెంటర్‌కు కేటాయించిన ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టడం, బాధిత మహిళలకు తక్షణం, సమగ్ర సహాయం అందించ‌డంలో స‌ఖి - వ‌న్ స్టాప్ సెంట‌ర్ కీల‌క‌పాత్ర పోషిస్తోంద‌న్నారు. బాధిత మ‌హిళ‌ల‌కు ఒక్కచోటే అవసరమైన అన్ని సేవలు పొందేలా ఈ కేంద్రాలు చేయూత‌నిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌త్యేక వాహ‌నంతో బాధితులకు త్వరితగతిన కౌన్సిలింగ్, వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సహాయం వంటి సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు వీల‌వుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌తో పాటు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోంద‌న్నారు. మ‌హిళా సాధికార‌త‌తో పాటు మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక‌ వేత్త‌లుగా ఎదిగేలా చేసేందుకు అహ‌ర్నిశ‌లు కృషిచేస్తోంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, విజయవాడ అర్బన్ సీడీపీవో జ్యోత్స్న, మిషన్ శక్తి కోఆర్డినేటర్, సూపర్వైజర్లు, ఆంగన్‌వాడీ కార్యకర్తలు, సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :