ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, (ఎంపీయుపి) మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ ఉర్దూ పాఠశాల హెచ్ఎం- బద్రున్నిసా బేగం ఆధ్వర్యంలో పిల్లల బంగారు భవిష్యత్ కోసం- బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీమ్ 4.0) అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, పాఠశాల హెచ్ఎం- బద్రునిసా బేగం, విద్యా కమిటీ చైర్మన్ సుభాన్ మౌలానా, ఉపాధ్యాయులు నిజాముద్దీన్, జరీనా, తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని ఎంతో ఆత్మీయంగా మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి, వంట ఏ విధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన స్వయంగా తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ మొగిలిశ్వరమ్మ, ఎంపియుపి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News