Wednesday, 29 July 2026 12:08:52 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఓపెన్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..! వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 13 February 2026 09:38 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ఎన్‌టీఆర్ జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీవోఎస్ఎస్‌) ఇంట‌ర్మీడియెట్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు బృంద స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి.. ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఓపెన్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మావేశం జ‌రిగింది. పాఠ‌శాల విద్య‌, రెవెన్యూ, పోలీస్‌, ప్ర‌జా ర‌వాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్‌, పోస్ట‌ల్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు హాజ‌రైన ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ మార్చి- 2 నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఏపీవోఎస్ఎస్ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌న్నారు. విజ‌య‌వాడ డివిజ‌న్‌కు సంబంధించి 603 మంది, నందిగామ‌కు సంబంధించి 882 మంది, తిరువూరుకు సంబంధించి 369 మంది మొత్తం 1,854 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతార‌న్నారు. వీటికోసం 11 ప‌రీక్ష కేంద్రాల‌ను సిద్ధం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి చీఫ్ సూప‌రింటెండెంట్లను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. 144 సెక్ష‌న్ అమ‌లు, బందోబ‌స్తు ఏర్పాటు, భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, సీసీ కెమెరాల నిఘా విష‌యంలో పోలీసు శాఖ‌తో స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌న్నారు. మూడు ఫ్ల‌యింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయాల‌న్నారు. ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు స‌కాలంలో ప‌రీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్ర‌జా ర‌వాణా అధికారులు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌న్నారు. నో సెల్‌ఫోన్ జోన్ నిబంధ‌న‌ల‌కు క‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చూడాల‌న్నారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని, ప్రాథ‌మిక చికిత్స కిట్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా స‌న్న‌ద్ధంగా ఉండాల‌న్నారు. తాగునీరు, పారిశుద్ధ్యంపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని సూచించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను కూడా విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని, ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉండాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మావేశంలో డీఆర్‌వో ఎం ల‌క్ష్మీన‌ర‌సింహం, డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :