Saturday, 13 June 2026 01:22:39 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఈనెల 14న కర్నూలులో జరిగే ఓబిసి మహాసభలను జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేసిన ప్రజాసంఘాల నాయకులు

Date : 08 December 2025 06:52 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఈనెల 14న కర్నూలులోనీ, జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగే ఓబిసి మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సామాజికవేత్త డాక్టర్ డి.నాగన్న, బాంసేఫ్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల.హరిప్రసాద్, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ ఈ.శివన్న గౌడ్, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, బానకచర్ల ఉపసర్పంచ్ నరసింహులు గౌడ్, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల.అబ్రహం, బుద్దిస్ట్ సొసైటీ బోధి శేషగిరి, అంబేద్కర్ యూత్ & సమాజ సేవకుడు కలబండి.నాగరాజు, సోషల్ మీడియా ప్రతినిధి దక్కా.శ్రీకాంత్, ప్రజా సంఘాల నాయకులు దేవభక్తుడు, మేకల.భాస్కర్, బీసీ సంఘాల నాయకులు కలిసి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈనెల 14న , ఉదయం 10 గంటలకు కర్నూలులోని, జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగే సమావేశానికి న్యూఢిల్లీ నుండి బామ్సేఫ్ సంస్థ జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రం, రాష్ట్రీయ పిచడా వర్గ్ మోర్చా జాతీయ అధ్యక్షుడు చౌదరి వికాస్ పటేల్ లు మరియు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ప్రజా సంఘాల డాక్టర్లు, సామాజికవేత్తలు, విశ్లేషకులు, మేధావులు హాజరవుతున్నారని అన్నారు. ఈ ఓబిసి మహాసభలలో రాజ్యాంగం అమలుకై 75 సంవత్సరాలు గడిచిన ఓబీసీల కోసం రాయబడిన 340 ఆర్టికల్ ఎందుకు అమలు కాలేదనీ, ఓబిసి కుల ఆధారిత జనగణలోనే 52 నుండి 60% వరకు ఉన్న ఓబీసీల అభివృద్ధి దాగి ఉందా, 52 నుండి 60% ఉన్న ఓబీసీలకు తిరుమలేయర్ నిబంధనలతో 27% రిజర్వేషన్లు అమలు చేస్తూ 3.5% ఉన్నవాళ్లు ఆర్థికంగా వెనకబడ్డ వాళ్లని చెబుతూ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధం, ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఎన్నికలు జరగా ఉన్నంతకాలం మూల నివాసి బహుజన ప్రజల సమస్యలు తీరవు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతీయ పార్టీలు వాటి ప్రభావాన్ని తిరిగి పొందలేవా, బామ్సేఫ్ మరియు నేషనల్ ఓబీసీ మోర్చా వంటి జాతీయ స్థాయి సంస్థలు చేస్తున్న సంఘటిత శక్తితోనే మన మహా పురుషులు కోరుకున్న సామాజిక పరివర్తన స్వేచ్ఛ సమానత్వం సోదరుభావంతో కూడిన సమాజం సాధ్యం అనే అంశాలపై లోతైన విశ్లేషణ మరియు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కాబట్టి కుల మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా ఓబిసి (బిసి) లు ప్రతి ఒక్కరూ తప్పక హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ ఓబిసి మహాసభలో మీరు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా తెలుసుకోలేని చరిత్ర నిజాలు, బీసీలు ఏ విధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కుతున్నారో మీరు తెలుసుకోవచ్చును. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం, నందికొట్కూరు నియోజవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :