ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా.రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు పట్టణంలోనీ, నంద్యాల రోడ్డులో ఉన్న, ఉర్దూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో & ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్ ఎస్ఎండి.గౌస్ ఆజం ఆధ్వర్యంలో స్కూల్ నందు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 ఎం.అయూబ్ అహ్మద్, టిడిపి సీనియర్ మైనార్టీ నాయకుడు సి.కలిముల్లా, ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ బాబు, పట్టణ టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్.రఫీక్ పాల్గొని, విద్యార్థులకి పుస్తకాలు యూనిఫామ్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
Admin
E Nivas News