ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గంలోని, పలు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్య ముందుకు సాగటం లేదని, రెగ్యులర్ అధికారి లేక,అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం వల్ల గిరిజన విద్యార్థులకు విద్య అందటం లేదని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ అధికారులను కోరారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ సుండిపెంట ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో* రెడవ తరగతి నుంచి 9వ తరగతి వరకు 75 మంది విద్యార్థులు ఉన్నారని,ఐతే ఒక ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు బాధ్యతలు మరియు వార్డెన్ బాధ్యతలు చూడాలి. ఒక తెలుగు ఉపాధ్యాయుడు మాత్రమే బోధిస్తున్నాడని, సబ్జెక్టు వారిగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. హిందీ,ఇంగ్లీష్,లెక్కల్, సాంఘిక శాస్త్రము, జీవశాస్త్రము సబ్జెక్టులు వారీగా ఉపాధ్యాయులను నియమించాలని, *శివపురం చెంచుగూడెంలోని, ఆశ్రమ పాఠశాలలో* మొత్తం 92 మంది విద్యార్థులు ఉన్నారని సాంఘిక శాస్త్రము బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, *పాలెం చెరువు చెంచుగూడెంలోని, ఆశ్రమ పాఠశాలలో* మొత్తం 160 మంది విద్యార్థులు ఉన్నారని, తెలుగు బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, చెంచు గిరిజన విద్యార్థులకు అందని ద్రాక్షగా విద్య మారిందని,చెంచు గిరిజన విద్యార్థులకు విద్య అవసరం లేదా? చెంచు గిరిజన విద్యార్థుల విద్య గురించి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఆశ్రమ పాఠశాలల గురించి పట్టించుకోని ఆ అధికారిని వెంటనే బదిలీ చేయాలని,రెగ్యులర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని నియమించాలని, ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు వారిగా ఉపాధ్యాయులను నియమించాలని ఆయన కోరారు.
Admin
E Nivas News