Monday, 14 September 2026 06:04:27 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & నిత్య సమాజ సేవకుడు & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి. నాగేశ్వరరావు కు ఘనంగా సన్మానం చేసిన ఎడి

Date : 14 November 2025 09:00 AM Views : 302

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు కు జర్నలిస్టు యూనియన్ నాయకుడు & ఎడిటర్ తుపాకుల రమేష్ శాలువా కప్పి, పూలమాల మెడలో వేసి, సొంత గ్రామం మొదలుకొని సింగపూర్ దేశం వరకు చేస్తున్న సమాజ సేవకు గుర్తింపుగా జ్ఞాపికను చేతికి అందించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా సీఈవో & చీఫ్ ఎడిటర్ తుపాకుల రమేష్ మాట్లాడుతూ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు గత 21 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన కోసం బట్టలు పంపిణీ చేయడం, చనిపోయిన వారికి దహన సంస్కారాలకు ఆర్థిక సహకారం చేయడం, గాయాల పాలైన లేక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహకారం అందించడం, గ్రామంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేయడం, తిరుపతి దేవస్థానానికి, తదితర దేవస్థానాలకు వెళ్లలేని వారికి ప్రతి సంవత్సరం 36 వాహనాలలో తన సొంత ఖర్చులతో దర్శనాలు చేయించడం, క్రీడాకారులకు ఆటవస్తులను పంపిణీ చేయడం, గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు అధికారులకు సహకారం అందించడం, ఇటీవల పి4 మార్గదర్శి బంగారు కుటుంబాలులో భాగంగా బానకచర్ల గ్రామంలో పేద వృద్ధ దంపతులకు ఇంటి నిర్మాణం చేపట్టడం వంటి అనేక సమావేశ సేవ కార్యక్రమాలు నిర్వహించి దేశ విదేశాలలో అందరి అభినందనలు పొందడం జరిగిందన్నారు. మన భారతదేశంలోని, అన్ని రాష్ట్రాల నుండి సింగపూర్ దేశానికి వచ్చిన ముఖ్యమంత్రులకు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు కుల మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా అందరికీ ఆహ్వానం పలికి వారికి ఆతిథ్యం ఇవ్వడం చేయడం జరిగిందన్నారు. సింగపూర్ దేశంలో కూడా మన తెలుగు వారి కొరకు అనేక సమావేశ సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఆయన సేవలను గుర్తించి సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆయనకు వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు, గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆయన అందరికీ అంతర్జాతీయ సమాజ సేవకుడిగా, అందరివాడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఆయన రాజకీయాలలో చురుకుగా పాల్గొని, గొప్ప గొప్ప పదవులు పొంది పేదల కోసం ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. మా జర్నలిస్టు యూనియన్ తరపున, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల తరఫున డాక్టర్ టేకూరి. నాగేశ్వరరావుకు అంతర్జాతీయ బెస్ట్ సోషల్ హీరో గా బిరుదుని ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ యమ్మని.శివన్న, ఉమ్మడి కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్- ఎస్.షర్ఫద్దీన్ అలి, మీడియా ప్రతినిధులు కలబండి.అంకన్న, డక్క.శ్రీకాంత్, కలబండి.మోసే, వేంపెంట గ్రామ నాయకులు మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె.సత్యరాజ్, మాజీ ఎంపీటీసీ- శివకుమార్, జీ.సుబ్బరావు,బొమ్మ.రాజేష్, బోనపల్లె వినయ్ కుమార్, డీలర్-మధు దారజీవన్న, దారప్రసన్న,వేమారెడ్డి,యువరాజు,కుటుంబరావు,సోమనీ నాయక్,హరికృష్ణ నాయక్,రమేష్ రెడ్డి, బోనపల్లె సురేష్, ముద్దపాటి.ప్రసాద్, బోనాల. భాస్కర్, దార కిరణ్, చంద్ర, రామచంద్రుడు, పెద్ద రాజయ్య, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: