ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, పలు గ్రామాల ప్రజా సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్)లో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా కి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లకు బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్. ప్రధాన కార్యదర్శి జీ.ప్రవీణ్ కుమార్, తదితర నాయకులతో కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్, మండల ప్రధాన కార్యదర్శి జీ.ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ జిల్లా బిజెపి అధ్యక్షుడు అభిరుచి మధు సూచనలతో మండలంలోని, పలు సమస్యలను కలెక్టర్ కు తెలియజేసినట్లు తెలిపారు. మండల కేంద్రంలో పాములపాడు లో బిసి స్మశాన వాటికకు కంచె ఏర్పాటు చేయాలని, అలాగే నీటి సదుపాయంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, పున: నిర్మాణంలో ఉన్న దాదాపుగా 12 సంవత్సరాలపైగా నిర్మాణం సాగని రామాయణం గుడిని త్వరగా పూర్తి చేయాలని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్ షెల్టర్ ఏర్పాటు చేసి, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, శిధిలావస్థలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని నూతనంగా నిర్మించాలని కోరారు. అలాగే రుద్రవరం గ్రామంలో సిసి రోడ్లు, విద్యుత్ స్తంభాలకు తీగలు లాగాలని, అర్హులైన పేదవారికి నివాస గృహాలు, వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కలెక్టర్ జి.రాజకుమారి గణియా, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పదాధికారులు గోపాలకృష్ణయ్య, రాము, సూర్యం, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, మల్లికార్జున, వెంకటరమణ, మంగలి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News