ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చకుండా అలాగే కొనసాగించాలని ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాన్ని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకులు ఎస్.బాలయ్య, టి.వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఎంపీడీవో- యన్.చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు ఎస్.బాలయ్య, టి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎనర్జీ ఎస్ పేరును వి బి జి రాంజీగా పేరు మార్చడం విడ్డూరంగా ఉందన్నారు వలసలను నివారించి గ్రామీణ ప్రాంతాలలో వెంటనే ఉపాధి పనులు ప్రారంభించాలన్నారు. రాష్ట్రాల వాటా లేకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వంమే భరించాలని ఉపాధి కూలీలకు రోజుకు 600 రూపాయల వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనిచేసే ప్రదేశాలలో కూలీలకు మౌలిక వసతులు కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణించే ఉపాధి కూలీలకు 10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని, కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్.ఆర్.రమణ, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.
Admin
E Nivas News