Sunday, 13 September 2026 04:37:09 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 10 July 2026 09:11 PM Views : 97

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాములపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన (గ్రీవెన్స్ డే పిజిఆర్ఎస్)నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ఎమ్మెల్యే సమస్యలు, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్, పెన్షన్లు, విద్యుత్ శాఖలకు సంబంధించిన అంశాలతో పాటు తక్కువ వోల్టేజ్ సమస్యపై అనేక వినతులు అందాయి. ప్రజలు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. మిగిలిన దీర్ఘకాలిక సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి, వాటిని అత్యంత ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడం, ప్రతి కుటుంబ సమస్యకు పరిష్కారం చూపడం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజల సేవలో నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు నా కృషి కొనసాగుతుంది పేర్కొన్నారు. *దివ్యాంగులకు వరం -ఉచితంగా రెట్రోఫిట్టెడ్ స్కూటర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య* *పాములపాడు మండలంలో ముగ్గురు దివ్యాంగులకు లబ్ది-కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు* దివ్యాంగుల జీవనోపాధికి అండగా నిలుస్తూ వారి స్వయం సమృద్ధికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు ను అందిస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పేర్కొన్నారు. శుక్రవారం పాములపాడు ఎంపీడీఓ ఆఫీస్ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ సహకారంతో, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన పాములపాడు మండలం ముగ్గురు దివ్యాంగ లబ్ధిదారులకు ఉచితంగా మంజూరైన రెట్రోఫిట్టెడ్ స్కూటర్లను ఆయన పంపిణీ చేశారు. దాదాపు రూ.1.30 లక్షల విలువైన ఒక్కో ప్రత్యేక స్కూటీ దివ్యాంగుల రోజువారీ ప్రయాణాలకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ఈ సహాయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎస్సై పి.తిరుపాలు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం.వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ జి.రవీంద్ర రెడ్డి, ఎర్రగుడూరు హరినాథ రెడ్డి, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవింద్, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడాల జనార్దన్ రెడ్డి, ఇస్కాల నాగలక్ష్మీరెడ్డి, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, బీవీ నాగేశ్వరావు, టిడిపి మండల కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, వేంపెంట బూత్ కన్వీనర్ బోనపల్లె.వినయ్ కుమార్, లింగాల సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి, వేంపెంట సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, జూటూరు హఫీజ్, ఎమ్మెల్యే గవర్నమెంట్ పీఏ రవీంద్ర, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఎంఈఓ-1 బాలాజీ నాయక్, విబిజి రామ్ జి ఉపాధి హామీ పథకం ఏపీవో బి.జయంతి, వెలుగు ఏపిఎం ఏ.ఉమామహేశ్వరి, అగ్రికల్చర్ ఏవో ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, పిఆర్ జేఈ రాఘవేంద్రప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సువర్చల, విద్యుత్తు లైన్మెన్ శీను నాయక్, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: