ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న ఇంజనీరింగ్ విభాగం కన్స్ట్రక్షన్స్ పనులను ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని, ఈఈ లక్ష్మీనారాయణ, ఏఈ వెంకట్రామిరెడ్డి లతో కలిసి మెటీరియల్ నాణ్యతను, కట్టడాల నాణ్యతను, బిల్డింగ్ల ప్లానింగ్ ను అన్ని తిరిగి పరిశీలించడం జరిగింది. డైరెక్టర్ జీ.నాగముని పనులు కాంట్రాక్టర్లు నాణ్యత లోపాలు లేకుండా చూసుకోవాలని, కట్టడాలకు నీళ్ల క్యూరింగ్ కూడా బాగా చేయాలని, బిల్డింగులు కలకాలం ఉండే విధంగా, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. ఇందులో ఎక్కడ కూడా లోపాలు జరిగిన సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు.
Admin
E Nivas News