Friday, 11 September 2026 08:13:13 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయండి :- ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

మహానంది ట్రస్ట్ బోర్డు కాశి నాయక్ కు ఘన సత్కారం

Date : 04 August 2026 07:24 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేక చొరవ తీసుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కారం దిశగా కృషి చేసేందుకు తోడ్పాటు అందించాలని ఏపీ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. మహానంది దేవస్థానంలో పాలకమండలి ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా ముష్టపల్లి గ్రామానికి చెందిన కాశీ నాయక్ కి దక్కడం యావత్ గిరిజన జాతికి అరుదైన గౌరవం దక్కిందని జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మహానంది పాలకమండలి సభ్యుడుగా ఎన్నికైన శుభ సందర్భంగా జిపిఎస్ కార్యాలయ ఆవరణంలో అన్ని సంఘాల నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజు నాయక్, వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను గుర్తించి దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానంలో సేవ చేసుకునేందుకు చక్కటి అవకాశం కల్పించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అదేవిధంగా మహానంది దేవస్థానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవనోపాధికి ప్రభుత్వం కల్పించాలన్నారు. అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా ఎన్నికైన కాశీ నాయక్ కి సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, ఏఐబిఎస్ఎస్ బాల నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ బాలాజీ నాయక్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు నాగ స్వామి నాయక్, హనుమంతు నాయక్, ముష్టపల్లి గ్రామ నాయకులు రామ్, నర్సయ్య, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :