Friday, 11 September 2026 09:30:25 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆత్మకూరులో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు

Date : 03 September 2026 12:48 AM Views : 40

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఆత్మకూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీశైలం నియోజకవర్గ స్థాయిలోని ఐదు మండలాల జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని, కొండ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 7:30 గంటలకు ఆత్మకూరులోని, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన పేరు మీద ప్రత్యేక అర్చన, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చక్రం హోటల్ నుంచి గౌడ్ సెంటర్, నంద్యాల టర్నింగ్ మీదుగా కొండ గార్డెన్స్ వరకు జనసైనికులతో కలిసి భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కొండ గార్డెన్స్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అత్యధికసార్లు రక్తదానం చేసిన శ్యామ్ 65 సార్లు, కరివేన జనసేన నాయకులు నాగరాజు 54 సార్లు రక్తదానం చేసినందుకు వారిని ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి కర్నాటి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. జనసేన పార్టీలో యువత కష్టపడి పనిచేయాలని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త రౌతు అశోక్ కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. అతి త్వరలో ఆత్మకూరు పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తానని జనసైనికులకు తెలిపారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను నిలబెట్టి వారిని గెలిపించుకునే బాధ్యత ప్రతి జనసైనికుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగోడు మండల నాయకులు శాలు భాష, వలి, రాజేష్, హేమలత, సుకన్య, ప్రవళికతో పాటు పలువురు జనసైనికులు పాల్గొన్నారు. బండి ఆత్మకూరు మండలం నుంచి జనసేన నాయకులు సురేంద్ర, మల్లీశ్వరయ్య, వేణు ఆచారి తదితరులు పాల్గొన్నారు. మహానంది మండలం నుంచి మండల నాయకులు మారెడ్డి రామయ్య, మల్లికార్జున, మిద్దె శివ, కొల్లి దీప తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం మండల నాయకులు దేవరాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణం నుంచి జనసేన సీనియర్ నాయకులు శేషు, పురం హరీశ్, మండల నాయకులు అరుణ్, గుంజ నాగరాజు, సురేంద్ర,దుర్గరాజు, శ్యామ్, మహేష్, హబిబుల్లా, ఖాజా హుస్సేన్, అమాన్, మహబూబ్, నాగరాజు, లావణ్యతో పాటు పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన పూజా కార్యక్రమం, ద్విచక్ర వాహన ర్యాలీ, రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :