ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ఈ రోజు ఆగస్టు 15 తేదీన, 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి.ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ల చేతుల మీదుగా "పాములపాడు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ-షేక్ నూర్ అహమ్మద్ (బెస్ట్ పోలీస్ అవార్డు) అప్రిసియేషన్ సర్టిఫికెట్ " అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బెస్ట్ పోలీస్ అవార్డు గ్రహీత షేక్.నూర్ అహమ్మద్ మాట్లాడుతూ ఆ సంతోషాన్ని మీతో పంచుకొంటూ గత కొంత కాలంగా నాకు నాపై అధికారులు నాపై నమ్మకంతో నేను " శక్తీ యాప్ అవేర్నెస్ ప్రోగ్రాం " లు బాగా చేయడం జరిగిందన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున డిపార్ట్మెంట్ కు గౌరవం తెచ్చేలా ఆడపిల్లలకు మరియు ఆడవారికి రక్షణ,భరోసా ఇస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజంలో ధైర్యాన్ని కల్పించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున చైల్డ్ అండ్ వుమెన్ సేఫ్టీ కోసం ఒక యాప్ రూపంలో ఏర్పాటు చేసిన " శక్తీ యాప్ " ద్వారా వారికి ఎప్పుడూ ఏ సమయంలో అయిన సరే ఏదైనా ధనానికి గానీ, మానానికీ గానీ,ప్రాణానికి గానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే, అట్టి సమయంలో ఆడపిల్లలకు, ఆడవారికి అత్యవసర పరిస్థితులలో పోలీస్ స్టేషన్ కు రాకుండానే పోలీస్ సేవలు పొందండి అని చెప్పడమే కాకుండా వారి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లలో శక్తీ యాప్ ను డౌన్లోడ్ చేయించి వాటి ఉపయోగాలను తెలిపే కార్యక్రమానికి నాపై పెట్టిన ఆ బాధ్యతను ఎటువంటి ప్రయోజనాలు లేకున్న నా శక్తివంచన లేకుండా నాకు అప్పగించిన బాధ్యతను బరువుగా ఫీలవకుండా ఇష్టం గా మలుచుకొని నా నుండి నలుగురు అక్కచెల్లెమ్మలకు, ఆడపిల్లలకు నా మాటల ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో పెడదారి పడుతూ తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా,గురువులంటే గౌరవ మర్యాదలు లేకుండా మరియు పెద్దలంటే గౌరవం లేకుండా వాళ్ళ మూర్ఖత్వవు ఆలోచనలతో అటు వాళ్ళ జీవితాలనే కాకుండా కనిపెంచి, విద్యాబుద్ధులు చెప్పించిన వారిని మంచి చేయకపోగా వారి ఆత్మగౌరవాన్ని నడిబజారులో నిలబెట్టి నలుగురిలో నవ్వుబాటూ చేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకొంటున్న వారికి విద్యా యొక్క గొప్పధనాన్ని తెలుపుతూ ఆ విద్యా ఒక్కటే మీ జీవితాలను మార్చి సమాజంలో గౌరవ, మర్యాదలు కలిగించేలా బ్రతుకులనూ మార్చుతుందని చెప్పే గొప్ప అవకాశం నాపై అధికారులు ఇవ్వడం వల్లనే నేను ఎలాంటి లాభపేక్ష లేకుండా చేసిన కృషికి ఫలితమే వల్లనే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ దొరవారు నా కృషికి, సేవను గుర్తించి మెచ్చి ఈ రోజు నాకు లభించిన, నేను పొందిన " అప్రిసియేషన్ సర్టిఫికెట్ " అని తెలుపు కొనుటకు ఆనందపడుతున్నానని అన్నారు. ఇది పొందేందుకు కారణం అయిన మా ఆత్మకూరు డి.ఎస్.పి- ఆర్.రామాంజీ నాయక్ కి, ఆత్మకూరు రూరల్ సీఐ- ఎం.సురేష్ కుమార్ రెడ్డి కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాననీ ఏఎస్ఐ షేక్.నూర్ అహమ్మద్ తెలియజేశారు.
Admin
E Nivas News