Tuesday, 28 July 2026 06:02:30 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మహిళలకు వెంటనే 50% రిజర్వేషన్ అమలు చేయాలి

నందికొట్కూరు నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్.షాజహాన్ బేగం

Date : 17 July 2026 09:56 PM Views : 46

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కాలాంబ, నేషనల్ మహిళా కాంగ్రెస్ ఇంచార్జి అతిధి, నేషనల్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కమలాక్షి,, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అమర్జహా బేగ్ ల ఆదేశాల మేరకు ఈరోజు నందికొట్కూరు నియోజవర్గంలోని, జూపాడుబంగ్లా లో నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో మహిళలతో కలిసి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది. కేంద్రంలోని, బీజేపీ ప్రభుత్వం మహిళల సాధికారత గురించి గొప్పలు చెప్పుకుంటూ, ఆచరణలో మాత్రం మహిళలను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తోందని నందికొట్కూరు నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్.షాజహాన్ బేగం విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ జనాభాలో మహిళలు దాదాపు సగం ఉన్నప్పటికీ, వారికి రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపడం లేదన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాల్లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా వెంటనే చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంట్ స్థానాల పునర్విభజన (డిలిమిటేషన్)తో ముడిపెట్టడం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆమె ఆరోపించారు. మహిళలకు నిజంగా న్యాయం చేయాలనే సంకల్పం ఉంటే, స్థానాల సంఖ్య పెరిగే వరకు వేచి ఉండకుండా ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల్లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా సాధికారత పేరుతో ప్రచారం చేయడం ఒకవైపు, అమలును నిరవధికంగా వాయిదా వేయడం మరోవైపు జరుగుతోందని ఆమె విమర్శించారు. మహిళల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు, సమాన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ అమలు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని షేక్.షాజహాన్ బేగం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :