Friday, 11 September 2026 10:13:08 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

మెగాస్టార్ చిరంజీవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు

Date : 22 August 2026 05:56 PM Views : 110

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు మెగాస్టార్ చిరంజీవి కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సింగపూర్ దేశంలో అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తన అభిమానులు, స్నేహితులు మధ్య భారీ కేకును కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురంలో 1955వ సంవత్సరంలో, ఆగస్టు-22వ తేదీన జన్మించిన చిరంజీవి జన్మించారన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన శైలితో భారతీయుల హృదయాలలో ప్రత్యేక ముద్ర వేశారన్నారు. * చిరంజీవి సినీ ప్రస్థానంలో రికార్డు బద్దలు కొట్టిన సినిమాలు* 1978 – ప్రాణం ఖరీదు: నటుడిగా ప్రారంభమైన తొలి దశ, 1983 – ఖైదీ: చిరంజీవి స్టార్‌డమ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన చిత్రం, 1987 – స్వయంకృషి: నటుడిగా ఆయనలోని వైవిధ్యాన్ని చాటిన చిత్రం, 1988 – రుద్రవీణ: సామాజిక సందేశంతో గుర్తుండిపోయిన చిత్రంగా జాతీయ సమైక్యతకు సంబంధించిన నర్గిస్ దత్ అవార్డును అందుకుందన్నారు. 1990 – జగదేకవీరుడు అతిలోకసుందరి, 1991 – గ్యాంగ్ లీడర్, 1992 – ఘరానా మొగుడు, 2002 – ఇంద్ర, 2003 – ఠాగూర్, 2004 – శంకర్ దాదా ఎంబీబీఎస్, 2006 – స్టాలిన్, 2017 – ఖైదీ నంబర్ 150, దాదాపు దశాబ్దం తర్వాత ఆయన ఘనమైన రీఎంట్రీ 2019 – సైరా నరసింహారెడ్డి, 2022 – ఆచార్య, గాడ్‌ఫాదర్, 2023 – వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి చిరంజీవి కెరీర్‌లో 150కి పైగా సినిమాలు ఉన్నాయన్నారు. 2024లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆయనను భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రోలిఫిక్ ఫిల్మ్ స్టార్-యాక్టర్/డాన్సర్ గా గుర్తించిందన్నారు. 143 చిత్రాల్లో నటించడం, 537 పాటల్లో డ్యాన్స్ చేయడం ఈ రికార్డుకు ప్రాతిపదికగా నిలిచారన్నారు. ఆయన సేవలను గుర్తించిన ఆయా కేంద్ర ప్రభుత్వాలు చిరంజీవి కి 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ జాతీయ అవార్డులు లభించాయన్నారు. సినిమాలతో పాటు, సమాజ సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. 1998లో ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి అనేక సమాజసేవ కార్యక్రమాలను ప్రోత్సహించిందన్నారు. సినిమా రంగంలోకి ఎందరో వస్తారనీ, కానీ తరతరాల అభిమానాన్ని సంపాదించేవారు కొందరే ఉంటారని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగిన మెగాస్టార్‌గా కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించిన మహానటుడు చిరంజీవి అన్నారు. కష్టం నుంచి కృషి, పట్టుదలతో గొప్ప గొప్ప శిఖరాలకు ఎదగవచ్చని తన జీవితంతో నిరూపించిన వ్యక్తి చిరంజీవి అన్నారు. నటనలో, వైవిధ్యంలో, నృత్యంలో, ఉత్సాహం కలిగిన వ్యక్తిత్వం ఉన్న నటుడు అన్నారు. అభిమానుల పట్ల ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ కలిపిన అరుదైన వ్యక్తిత్వం వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. సినిమా హీరో చిరంజీవి పుట్టినరోజు అంటే ఒక నటుడి జన్మదినం మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన శకాన్ని గుర్తుచేసుకునే రోజు అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఆయురారోగ్యాలతో, ఆనందాలతో, మరెన్నో విజయాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు కోరుకుందాం అని పిలుపునిచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :