ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, కొత్తపేట వార్డు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో" కార్యక్రమం లో పాల్గొని 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అని వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈ డబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ జూన్-28,29, 30వ తేదీలలో నిర్వహించే పల్స్ పోలియో–2026 కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని పిలుపునిచ్చారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి తల్లిదండ్రుల బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆయన కోరారు. ఇది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా సహకరించాలని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది, వైద్య శాఖ సిబ్బంది నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News