ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : విజయవాడలో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డాక్టర్ పి.గురురాజా కు ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య & సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ ఎన్నారై డాక్టర్ పి.గురురాజా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ అధికారంలోకి రావడానికి ఎనలేని సేవ చేయడం జరిగిందన్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవం పదవికి కాదు, ప్రజాసేవకు అంకితం అని అన్నారు. ఎన్నారై డాక్టర్ పి.గురురాజా ఇటువంటి గొప్ప గొప్ప పదవులు భవిష్యత్తులో మరెన్నో చేపట్టాలని, ఆయనకు దేవుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మన తెలుగువారి అభివృద్ధి కొరకు, ఎన్నారైల అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు.
Admin
E Nivas News