ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, కృప వృద్ధాశ్రమంలో కువైట్ దేశంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కె.అబ్దుల్ గఫూర్ పుట్టినరోజు వేడుకలు ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే. అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు పట్టణానికి చెందిన మా రెండవ తమ్ముడు ల్యాబ్ టెక్నీషియన్ కె.అబ్దుల్ గఫూర్ పుట్టినరోజు సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్ కు నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సబ్ రిజిస్టార్ కె.అబ్దుల్ కరీం తెలిపారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్ కె.అబ్దుల్ గఫూర్, సబ్ రిజిస్టార్ కే. అబ్దుల్ కరీం లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇటువంటి అనాధల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అనాధ బాలల మధ్యన, అనాధ వృద్ధుల మధ్యన, నిరుపేదల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే వారి ఆకలి బాధలను తీర్చినవారము అవుదామని, వారందరూ కూడా మనకోసం పుణ్యఫలం లభించాలని అల్లా(దేవుడి),కి దువా చేస్తారని తెలిపారు. కుల, మతాలకతీతంగా, మానవత్వంతో ఉన్నవారు లేనివారికి సహకారం అందించాలని, వారి ఆకలి బాధలను తీర్చాలని దివ్య ఖురాన్ లో, వేదాలలో, ఉపనిషత్తులలో, బైబిల్లో రాసి ఉన్నదని తెలిపారు. అప్పుడే ఆ దేవుడు మనము దానం చేసిన దాని కంటే పది రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తాడని అన్నారు. ఇలా సేవ చేయడం వల్ల సమాజంలో మార్పు కోసం, పిల్లలలో కూడా సేవా గుణము అలవాటు కావాలనే ఉద్దేశంతో అందరికీ తెలియాలన్నారు. ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదని ఈ సమాజంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి పేదలకు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాము.
Admin
E Nivas News