Saturday, 12 September 2026 09:29:47 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

డైరెక్టర్ లు జి.నాగముని, ఎన్.రాఘవేంద్ర లకు ఘన స్వాగతం పలికిన ఏపీ ఈడబ్ల్యూఐడీసీ అధికారులు

Date : 04 August 2026 07:35 PM Views : 239

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో జరిగిన ఏపీ ఈడబ్ల్యూఐడీసీ పనుల, ఇంజనీర్ల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రాష్ట్ర డైరెక్టర్లు జి.నాగముని, ఎన్.రాఘవేంద్ర లకు ఈఈ ఎం.లక్ష్మీనారాయణ, డిఈఈ లు-జి.నాగరాజు, ఎం.బాలజోజప్ప, మిగతా ఇంజనీర్లతో కలిసి పుష్పగుచ్చాలు చేతికి అందించి, మేళ తాళాలతో ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యుఐడీసీ డైరెక్టర్ జి.నాగముని, ఎన్.రాఘవేంద్ర లు మాట్లాడుతూ మా చైర్మన్ రాజశేఖర్ 14 మంది డైరెక్టర్లతో కలిసి ఒక కమిటీగా ఏర్పడి ప్రతి ఉద్యోగస్తుడు 60 సంవత్సరాలు ఉన్న ఉద్యోగం వయసు కాలం 62 సంవత్సరాల వరకు ఉద్యోగ వయోపరిమితి పెంచుతూ ఈ జీవో తీసుకు రావడానికి ఒక కమిటీల ఏర్పడి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ లు కలిసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో చర్చించి ఈ జీవోను అమలు చేయడం జరిగిందన్నారు. ఈ మేనేజింగ్ కమిటీ ద్వారా ఏపీ ఈడబ్ల్యుఐడీసీ యొక్క వ్యవస్థలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, డైరెక్టర్లు అందరు సమన్వయంతో కలిసి అభివృద్ధి పనులు చాలు అన్నారు. గవర్నమెంట్ చేపడుతున్నటువంటి ప్రభుత్వ స్కూళ్లలో, కళాశాలలో, గ్రంధాలయాల నిర్మాణంలో ఇన్ఫాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలతో నిర్మించే ప్రతి ఒక్క పని మంచి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ తో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ చాలా మెరుగ్గా, నాణ్యతగా పనులు చేపట్టాలని ఏపీడబ్ల్యూ ఐడీసీ డైరెక్టర్లు జి.నాగముని, నాగరూరు రాఘవేంద్ర లు సూచించారు. ఈఈ, డిఈఈ లు, మిగతా ఇంజనీర్లు మేము రిటైర్మెంట్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు ఉద్యోగ పరిమితి పెంచి మళ్లీ విధులలోకి తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అభివృద్ధికి మా వంతు తోడ్పడు అందిస్తామని అన్నారు. ఏపీ ఈడబ్ల్యూఐడీసీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డైరెక్టర్లను ఇంజనీర్లు కోరారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్లు జి.నాగముని, ఎన్.రాఘవేంద్ర లకు అధికారులు, ప్రజా సంఘాల నాయకులు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, వారి సేవలను కొనియాడుతూ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి.ఎం.వెంకటేశ్వర్లు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జిల్లా కోఆర్డినేటర్ పి.ఓబులేసు, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ డిపార్ట్మెంట్ సూపరిండెంట్ చింతకాయల వెంగన్న, జూనియర్ అసిస్టెంట్ నాయకంటి చిన్న మద్దిలేటి, సైట్ ఇంజనీర్లు కే.వెంకటరామిరెడ్డి, పి.సురేష్ కుమార్, సి.మహేష్, కె.సురేంద్ర కుమార్, పి.రఘు మధు మోహన్, ఎస్ఎండి.ఆజాజ్ బాషా ఉమామహేశ్వరరావు, ఆర్.దివ్య, కె.సిహెచ్.మునీశ్వర్, జి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎం.లక్ష్మన్న హరీష్, ఎన్.దినేష్, ఆఫీస్ సబార్డినేట్ లు పి.హీరాలాల్, సి.బాలయ్య, కే.సుబ్బడు, ఏపీ శ్మశాన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తలారి నాగరాజు, రాష్ట్ర ట్రెజర్ రత్నస్వామి, జిల్లా అధ్యక్షుడు పీ.చంద్రుడు మరియు మండల నాయకులు అరె. నాగరాజు, ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :