ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా జూపాడుబంగ్లా మండలంలోని, వివిధ గ్రామాలకు చెందిన 235713 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. తూడిచేర్ల గ్రామానికి చెందిన దండల హరికృష్ణ కి 25,024/- రూపాయలు, జూపాడుబంగ్లా 2 గ్రామానికి చెందిన కాటేపోగు ఇందిరమ్మ కి 32,028/- రూపాయలు, తంగడంచ గ్రామానికి చెందిన గువ్వల శ్రీనివాసులు కి 13,301/- రూపాయలు, 80 బన్నూరు గ్రామానికి చెందిన అహల్య సిద్ధిరెడ్డి కి 42,919/- రూపాయలు, పారుమంచాల గ్రామానికి చెందిన పన్నగి ఈశ్వరమ్మ కి 41,441/- రూపాయలు, మండ్లెం గ్రామానికి చెందిన ప్రభుదాసు కి 81,000/- రూపాయలు మంజూరైన చెక్కులను ప్రభుత్వ అధికారులతో, జూపాడుబంగ్లా మండల నాయకులతో కలిసి లబ్ధిదారులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఢీ.గోపికృష్ణ, తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పీఏ- రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, పాల్గొనడం జరిగినది.
Admin
E Nivas News