ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామం నుండి వెలుగోడుకు పోయే రహదారిలో పడిపోయిన కల్వర్టును రోడ్డు భవనాల శాఖ వారు వెంటనే నిర్మించాలని గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ కోరారు. ఈ సందర్భంగా వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ మాట్లాడుతూ మా గ్రామం మీదుగా ఈ వెలుగోడు సింగల్ రోడ్డుపై అనేక ప్రాంతాల నుండి వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయని ఇక్కడ కల్వర్టు సగానికి పడిపోవడం వలన చాలా ప్రమాదాలు జరిగి చాలామంది ప్రయాణికులకు కాళ్లు, చేతులకు గాయాలు, ఇతర చోట్ల గాయాలు పాలు కావడం జరిగిందని, చాలాసార్లు ప్రమాదాలు కూడా జరిగాయని అన్నారు. కనుక రోడ్డు భవనాల శాఖ అధికారులు త్వరగా స్పందించి ఈ కల్వర్టును వెంటనే నిర్మించి, రోడ్డు వేయాలని కోరారు.
Admin
E Nivas News