ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మున్సిపాలిటీలోని, అర్బన్ కాలనీలో బుధవారం అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, చైర్ పర్సన్- మారూఫ్ ఆసియా, టిడిపి టౌన్ ప్రెసిడెంట్- జె.వేణు గోపాల్ రావు లతో కలిసి భూమిపూజ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్ధిన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్- ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ ఆత్మకూరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తో మేము కూడా ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పార్వతమ్మ, విద్యా కమిటీ చైర్మన్ సి.హెచ్.శివకుమార్, స్థానిక టీడీపీ నాయకులు ఉమాదేవి, రమణ, జావేద్, కిరణ్, ఏఈ- షాహీర్, కాంట్రాక్టర్ వెన్న.శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News