Monday, 14 September 2026 06:09:50 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విద్యార్థుల భద్రత డ్రైవర్ల బాధ్యత

ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇనిస్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి

Date : 23 January 2026 09:26 AM Views : 186

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఆత్మకూరు ఎంవీఐ కార్యాలయం దగ్గర, ఆయన పాఠశాల బస్సు డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆయన స్వయంగా డ్రైవర్లకు పలు వాహన చోదన మెళకువలను వివరిస్తూ, వారికి అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవర్లు పాటించాల్సిన కీలక నిబంధనలను స్పష్టం చేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ప్రతి పాఠశాల బస్సుకూ తప్పనిసరిగా ఫిట్‌నెస్ ఉండాలన్నారు. కండిషన్ లేని వాహనాలు రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవు అన్నారు. స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లకు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలనీ మరియు వారు హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వాహన సామర్థ్యం (సీటింగ్ కెపాసిటీ) కంటే ఒక్క విద్యార్థిని కూడా అదనంగా ఎక్కించకూడదన్నారు. విద్యాసంస్థల వాహనాలకు కచ్చితంగా 'స్పీడ్ గవర్నర్స్' అమర్చి ఉండాలనీ, వేగం పరిమితి దాటకూడదన్నారు. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు అగ్నిమాపక పరికరాలు (ఫైర్ ఎక్సటింగుషర్స్) పని చేసే స్థితిలో ఉండాలని, వారోత్సవాల సందర్భంగా ఎంవీఐ డ్రైవర్ల సందేహాలను నివృత్తి చేస్తూ, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డ్రైవర్లు డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ ధరించాలని, పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయడమే కాకుండా, యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: