ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో “వన్ మంత్ – వన్ కాన్స్టెన్సీ- ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మరియు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా లు నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త.జయసూర్య ఆధ్వర్యంలో పాములపాడు మరియు కొత్తపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ మరియు జిల్లా అధికారులు అర్జీలను స్వీకరించి, ప్రజల సమస్యలను ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ లకు వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య లు మేము గ్రామపంచాయతీలో చేపించిన పనులకు బిల్లులు ఇవ్వాలని గత సంవత్సర కాలం నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్న ఇవ్వడంలేదని, వెంటనే బిల్లులు ఇవ్వాలని కోరుతూ, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు కృష్ణరావుపేట నుండి మిటకందాల వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నాసిరకమైన రోడ్డు వేశారని పంచాయతీరాజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలి నేషనల్ హైవే ఎన్ హెచ్ 340 సి ఇరువైపులా ఉన్న రైతుల పొలాలకు రాస్తాలు ఏర్పాటు చేయాలని, మాల మహానాడు నాయకుడు కలబండి.బాలస్వామి గత 10 సంవత్సరాల నుండి 2.80 సెంట్ల భూమిని ఆన్లైన్ చేయాలని తిరుగుతున్న చేయడం లేదని, ఇప్పటికైనా త్వరగా చేయాలని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం కిడ్నీ, గుండె జబ్బుల రోగులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు త్వరగా పెన్షన్లు మంజూరు చేయాలని, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సిపి రైతు విభాగం మండల అధ్యక్షుడు అంబయ్య, తదితర రైతులు పాములపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న లింగాల రాస్తా ఆశ్రమం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సిసి రోడ్డు వేయాలని, ఆర్టీసీ బస్సులు పాములపాడులో స్టేజి ఉన్నా కూడా నిలపకుండా పోతున్న డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాషా, నాయకులు రాచపూడి సురేష్ లు రుద్రవరం గ్రామం దగ్గర నేషనల్ హైవే 340సి కి ఇరువైపులా సర్వీస్ రోడ్డు వేయాలని, టిడిపి నాయకుడు మేకల జాన్ బాబు ఇస్కాల భవనాసి వాగుపై వంతెన నిర్మించాలని, మాల మహానాడు నాయకుడు నల్లమల అబ్రహం పాములపాడులో అంబేద్కర్ భవన్ కు బిల్డింగ్ మంజూరు చేయాలని, రెండు మండలాల రైతులు ఎక్కువగా భూ సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా లు మాట్లాడుతూ ప్రజలు అందించిన ప్రతి అర్జీని పరిశీలించి, సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డి ఎం హెచ్ ఓ వెంకటరమణ, ఆత్మకూరు ఆర్డీవో వెంకట శివ, డీఎస్పీ- ఆర్.రామాంజి నాయక్, ఐసిడిఎస్ సిడిపిఓ మంగవల్లి, సిఐలు ఎం.సురేష్ కుమార్ రెడ్డి, సుబ్రమణ్యం, తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎస్ఐలు పి.తిరుపాలు, ఓబులేసు, ఇన్చార్జి ఎంపీడీవో సులోచన, ఎంఈఓ బాలాజీ నాయక్, ఎస్ఓ తిరుపాలు, డిటి పఠాన్ బాబు, విబిజి రాంజీ ఏపీవోలు బి.జయంతి, విమలమ్మ, ఆర్ఐ డి.ఖాజాబి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, అర్జీదారులు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News