Wednesday, 29 July 2026 12:39:43 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరులో ఘనంగా రైతు సంబర సభ- అన్నదాత సుఖీభవ కార్యక్రమం

Date : 19 November 2025 11:36 PM Views : 223

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలో మార్కెట్ యార్డ్ నందు 21 వ విడత పిఎం కిసాన్ మరియు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కే.హేమలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగాల.వెంకట కృష్ణారెడ్డి హాజరు కావడం జరిగింది. వ్యవసాయ శాఖ సహాయ వ్యవసాయ సంచాలకులు హేమలత మాట్లాడుతూ నియోజకవర్గంలో 25018 మంది రైతులకు 17.08 కోట్లు, ఆత్మకూరు మండలంలో 7257 మంది రైతులకు 4.93 కోట్లు రూపాయలు నగదు జమ చెక్కును పంపిణీ చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన పథకాలను రైతులకు వివరించి, మండలంలో అన్నదాత సుఖీభవ నగదు జమ కాని రైతులు తమ గ్రామాలలోని రైతు సేవ కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. అలాగే మండల తహసిల్దార్- జి.రత్న రాధిక మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ జమకాని రైతులు అర్జీ పెట్టుకోవచని తెలిపారు. అబ్దుల్లాపురం భాష, మరియు మండల అధ్యక్షుడు రవీంద్రబాబు లు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అలాగే మాజీ మండల అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అందించడం రైతులకు ఒక వరంగా భావిస్తున్నారని తెలిపారు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి యూరియా పంపిణీ పంట నష్టపరిహారం మొదలైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని రైతులకు వివరించారు. ఉద్యానవన శాఖ అధికారి- కె.చందన ఉద్యానవన శాఖ యొక్క పథకాలను రైతులకు వివరించారు. అలాగే పట్టు పరిశ్రమ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ కలామ్ పట్టు పరిశ్రమ శాఖ యొక్క పథకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి అరుణ, ఎంపీడీవో- సయ్యద్.ఉమర్, ఇతర మండల స్థాయి అధికారులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుపమయ్య , విఆర్ఎస్ కి చైర్మన్ మల్లికార్జున్రెడ్డి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, బిజెపి కార్యదర్శి షబానా, ఆత్మకూరు రైతు సేవా సహకార పరపతి సంఘం చైర్మన్-షాహబుద్దీన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కాటంరెడ్డి ,వీరభద్రుడు, పద్మావతి , రైతు సంఘం అధ్యక్షులు తపాల్ ఆశ్రఫ్ అలీ, ఇతర ప్రజా ప్రతినిధులు, మండలంలోని వివిధ గ్రామాల రైతులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఎంపీఈఓ లు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :