ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు లో జరిగిన ప్రత్యేక పిజిఆర్ఎస్ లో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా లకు కృష్ణరావుపేట టు మిట్టకందాల తారు రోడ్డు వెంట కల్వర్టులు నిర్మించాలని వినతి పత్రం సమర్పిస్తే స్పందించిన పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ఈరోజు ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కృష్ణరావుపేట నుండి మిట్టకందాల వరకు తారు రోడ్డు అప్పటి వైయస్సార్సీపి ప్రభుత్వంలో వేయడం జరిగింది. అయితే కాంట్రాక్టర్ వైసిపి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రోడ్డు వెంట కల్వర్టులు నిర్మించకుండా ఉన్నందున మిట్టకందాల పోలిమేరలోని ఎస్సీల పంట పొలాలు వర్షాకాలంలో నీట మునిగి నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ అధికారులు కాంట్రాక్టర్ ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారన్నారు ఇంకా సంవత్సరం మెయింటినెన్స్ ఉన్న ఇంతవరకు రోడ్డు ప్యాచింగులు వెయ్యలేదని వెంటనే రోడ్డుకు పాచింగులు రోడ్డు వెంట కల్వర్టులు నిర్మించి ఎస్సీ రైతుల పొలాలు నీట మునగకుండా చూడాలని మండి పడ్డారు. కల్వర్టులు నిర్మించనందుకు పొలాల్లోని నీరంతా మిట్టకందాల గ్రామంలోని, ఎస్సి బీసీ ఎస్టీ కాలనీలు మునిగి పోయి స్కూల్ దగ్గర పిల్లలు కూడా దాటలేని పరిస్థితి ఉందని వెంటనే కల్వర్టులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే అప్పటి వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్, పంచాయతీరాజ్ అధికారులపై లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ల దృష్టి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సులోచన, రైతులు బుడ్డన్న, డీలర్ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, అబ్రహాము, యువరాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News