ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ప్రభుత్వ టౌన్ ఉన్నత పాఠశాలలో ఈరోజు 'మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్' (మెగా పిటిఎం-4.0) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బీటీ.నాయుడు, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు ముఖ్య అతిథులుగా విచ్చేసి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ.నాయుడు, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని కు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం, పర్యవేక్షణ ఎంతో కీలకమని. పిల్లల చదువు, వారి ప్రవర్తన మరియు పురోగతి గురించి తెలుసుకోవడానికి ఇలాంటి పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News