ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, కంబాలపల్లి గ్రామ సమీపంలో నేషనల్ హైవే 340సి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్ల జయకృష్ణ (26) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు వైపు నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న ట్రైలర్ పంచర్ కావడంతో ప్రక్కకు ఆపుకుంటున్న సమయంలో పాములపాడు వైపు నుండి కంబాలపల్లి గ్రామానికి చెందిన జయకృష్ణ పల్సర్ బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి (లారీ)ట్రైలర్ కు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలు కావడం జరిగింది. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, జయకృష్ణ మృతి చెందినట్లు డాక్టర్ వెల్లడించారు. ఈ ఘటనపై పాములపాడు ఎస్సై పి.తిరుపాలు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో కంబాలపల్లి గ్రామంలో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Admin
E Nivas News