Tuesday, 28 July 2026 06:06:18 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ద్వారా తక్షణమే ఏర్పాటు చేయాలి

మద్దతు ధర 2400/- ప్రకారం వ్యాపారస్తులు కొనుగోలు చేయాలి పి.వెంకటేశ్వర్లు (సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి)

Date : 11 November 2025 07:51 PM Views : 189

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మంగళవారం సిపిఐ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ అఖిలభారత కిసాన్ మహాసభ బృందం మొక్కజొన్న రైతులను కలిసి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిక్కిలి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న పంటను నంద్యాల జిల్లాలో విస్తారంగా పండించారని అనేక తుఫాన్ వల్ల రైతుల పంట దిగుబడి తగ్గిందని ఎకరాకు కనీసం 15 కింటాలు కూడా దిగుబడి రావడం లేదని రైతు ఎకరాకు పెట్టుబడి 30 నుండి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట నష్టపోవడం జరిగిందన్నారు. తీరా చూస్తే పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. దీనికి తోడు. ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పు తెచ్చి పంటను పండించిన మార్కెట్లో అమ్మేసరికి ప్రభుత్వం మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారస్తులు, దళారులు కుమ్మక్కై 1700/- ,1600/- రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని దీనివలన రైతు క్వింటాలుకు 600 రూపాయలు నష్టపోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు రైతులు నష్టపోతున్న చూసే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే మొక్కజొన్న రైతులు 60% పైనే పంట కోత కోశారని మరి కొద్ది రోజుల్లోనే పంట పూర్తయ్య పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం పెంచినటువంటి ధర దళారులకు వ్యాపారస్తులకు దక్కే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది అని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేదికలపైన గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అందువలన తక్షణమే మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాలు అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసి మొక్కజొన్న రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 40 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని, రైతులకు.రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు టి.నరసింహులు, వేల్పుల.ఏసన్న, శ్రీరాములు, రుద్రవరం గ్రామ రైతులు గొల్ల సురేష్. ఎస్.సద్దాం, నబిరసూల్, అల్లా ప్రకాష్, మహేష్, మన్సూర్, రాజు, శాలు భాష తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: