Monday, 14 September 2026 03:51:19 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాములపాడులో ఘనంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 28 December 2025 07:26 PM Views : 294

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజవర్గ ఇన్చార్జ్ తేనే.నాగరాజు, మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ ల ఆధ్వర్యంలో అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరు వేశారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తేనె నాగరాజు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు- డి.స్వామన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, తదితర నాయకులు మాట్లాడుతూ 1885 వ సంవత్సరం, డిసెంబర్-28 వ తేదీన బొంబాయి నగరంలోనీ గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో మొట్ట మొదటి కాంగ్రెస్ సమావేశం బ్రిటిష్ రిటైర్డ్ ఐ సి ఎస్ అధికారి ఏవో హోమ్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ సమావేశంనకు ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారని తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 72 మంది ప్రతినిధులు పాల్గొని దేశ స్వతంత్ర ము కోసం కాంగ్రెస్ పార్టీ నీ స్థాపించారని పేర్కొన్నారు. మహాత్మ గాంధీ నేతృత్వంలో 1920 లో స్వాతంత్ర పోరాటంను ప్రారంభి, కాంగ్రెస్ పార్టీ అహింసా మార్గంలో స్వాతంత్రము సాధించినదని అన్నారు. ఈ రోజు దేశం అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించినదని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు అమలుచేసి దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మించి ప్రజల కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి మరింత అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గరీబీ హటావో దేశ్ బచావో నినాదంతో పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. మరియు బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారన్నారు. నిరుపేదలకు ఇండ్లు లేని వారికి ఇండ్లు, భూమి లేని వారికి భూములు ఇవ్వడం జరిగినదని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనీ అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, పీవీ నరసింహారావు నేతృత్వంలో సరళి కృత్రిమ విధానాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ను తీసుకుని వచ్చి 100 రోజులు పనిదినాలను తీసుకుని అందరికి పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దని, నేటి బిజేపి ప్రభుత్వం మహాత్మ గాంధీ పేరును తొలిగించడం, కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఇవ్వవలసిన గ్రాంట్ ను 60 శాతం కేంద్ర వాటా,40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా గా మార్చడం ద్వారా త్వరలోనే ఈ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తుందని పేర్కొన్నారు. కాబట్టి దేశంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ నీ తిరిగి అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. కనుక ప్రజల చేత కాంగ్రెస్ పార్టీ ని తిరిగి తీసుకొని వచ్చేవరకు కృషి చేస్తామని, బీజేపీ నుండి దేశాన్ని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల భారీ కేకును కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అందరికీ మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఉస్మాన్ భాష, సుంకన్న గౌడు, పాములపాడు జూపాడుబంగ్లా, కొత్తపల్లి మండలాల నాయకులు అత్తావుల్లా, సికందర్, మద్దిలేటి, మనోహర్, ఇంతియాజ్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :