Tuesday, 15 September 2026 09:11:32 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఏలూరులో కదం తొక్కిన రైతాంగం...! రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా రైతుల భారీ ర్యాలీ

హలో రైతన్న- ఛలో ఏలూరు బహిరంగ సభలో అఖిలభారత్ కిసాన్ సభ (ఏఐకేఎస్ ) జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్

Date : 03 July 2026 09:43 PM Views : 128

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు సందర్భంగా నిర్వహించిన హలో రైతన్న -ఛలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతుల మహా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర నలుమూలలు నుండి వచ్చిన అన్నదాతలు పెట్టారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణం అవుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరు నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు సందర్భంగా నిర్వహించిన హలో రైతన్న ఛలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతుల మహా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర నలుమూలలు నుండి నంద్యాల జిల్లా నుండి వచ్చిన అన్నదాతలు కదం తొక్కారు. కళాకారుల డప్పు దరువులతో, నృత్యాలతో ఉత్సాహపూరితమైన వాతావరణంలో నెలకొంది. ఏలూరు నగరంలో నలుమూలల అరుణ పతాకాల అలంకరణలు రైతన్నల అడుగులతో హోరెత్తింది. చిరుజల్లుల మధ్య అన్నదాతలు కిసాన్ సభ జెండాలతో ఏలూరు నగరంలో భారీ కవాతు నిర్వహించారు. ముందుగా జూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి భారీ రైతాంగ ప్రదర్శన రైతన్నల నినాదాలతో ప్రారంభమైంది. ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న ఇండోర్ స్టేడియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజూ కృష్ణన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ లూటీకి పాల్పడుతున్నారని అయన తీవ్రంగా విమర్శించారు. అమెరికాలో ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి 32 లక్షల రూపాయల రాయితీలుస్తుంటే భారతదేశంలో మాత్రం రైతులు చేసే వ్యవసాయాన్ని దండగ మారిన పనిగా మార్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల ఆత్మహత్యలు ప్రతి ఏటా పెరుగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 10 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిపై పనిచేస్తూ పంట పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల మంది కౌలు రైతులకు ఎటువంటి రాయితీ అందడం లేదని ఇది ఎంతవరకు సమంజసమో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా కార్పొరేట్ వ్యవసాయ అనుకూల విధానాలను ఈ దేశంలో అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం తహతహలాడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నోరెత్తకుండా భజనపరులుగా మారిపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా మోడీ చట్టాలకు వంత పాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మౌనం వహిస్తున్నారని రెండు వేరు వేరు మాత్రం కాదని అన్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రజలపై భారాలు కార్పొరేట్లకు సేవలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మునిగి తేలుతుందని పేర్కొన్నారు. రైతుకు రాయితీ ఇవ్వడానికి సిద్ధం లేని ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు భూములను ఇస్తూ వేలకోట్ల రూపాయలను మాఫీ చేస్తూ ప్రజల సంపదలను దోచిపెడుతుందని ధ్వజమెత్తారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో సాగునీరుతో పాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో సెలయేరుల పారుతుందని చెప్పారు. గోదావరి జిల్లాలోని ఇలాంటి పరిస్థితుంటే కరువు జిల్లాలు వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఉదహరించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కి 4,000 కోట్ల రూపాయల కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయిపోతుందని ఏలూరు,, ఎన్టీఆర్ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు ఎకరాలకు సాగునీరు అందుతుందని అయినా సరే పాలకులు నిధులు కేటాయించకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ఉచిత పంటల బీమా లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటూనే గోదావరి బానకచర్ల ప్రాజెక్టుకు 80 వేల కోట్ల రూపాయలతో ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొద్దిపాటి బడ్జెట్తో ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సన్న చిన్న కారు, మధ్యతరగతి రైతులు సేద్యం చేస్తుంటే ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

కౌలు రైతులకు అన్యాయం చేసిందని తాము వస్తే కౌలు రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్న ఎటువంటి చర్యలు చేపట్లేదన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేకపోవడంతో పంట నష్ట పరిహారాలు, రుణాలు అందకపోవడంతో కౌలు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వాపోయారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఎరువులు ధరలు మాత్రం దారుణంగా పెంచుతున్నారని, రైతులను దిక్కుతోచని స్థితికి నెట్టవేయబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే కేజీ బేసిన్లో ఉన్న చమురు నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాలు ప్రజలకు వాటా అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆక్వా రైతులు కూడా దివాళా తీసే పరిస్థితులకు పాలకుల విధానాల కారణంగా ఉందని చెప్పారు. కొల్లేరు సమస్య దశాబ్దాలుగా హామీల రూపంలో తప్ప ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. కొల్లేరుకు వలస పక్షులు వలస రావడమే కాకుండా కొల్లేరు ప్రజలు కూడా వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అయినా సరే పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ సభకు రైతాంగ ఉద్యమ నిర్మాత కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి స్వగ్రామం పోతునూరు నుండి అల్లూరి సీతారామరాజు స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు నుండి రైతు ఉద్యమ నాయకుడు గాదిరాజు శ్రీరామరాజు స్వగ్రామం భీమవరం నుండి ఆ చిత్రపటాలను తీసుకువచ్చి అఖిలభారత రాష్ట్ర నాయకులకు అందజేస్తూ నినాదాలు రూపంలో నివాళులర్పించారు.

ఈ వేదికపై నంద్యాల జిల్లా ఏపీ రైతు సంఘం కార్యదర్శి ఏ.రాజశేఖర్, జిల్లా నాయకులు టి.వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర సీనియర్ నాయకులు వై.కేశవరావు, పోలవరం నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, మహిళా జిల్లా కన్వీనర్ ఎం.నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.సీతారామయ్య కోన శ్రీనివాసరావు, బొడ్డు రాంబాబు, కోర్స జలపాలు, ఆయా పి.ఆంజనేయులు, కె.మోహనరావు, హేమలత, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 4,5 తేదీలలో డీసీఎంఎస్ కాన్ఫరెన్స్ హాల్లో, రైతు సంఘం రాష్ట్ర మహాసభలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రతినిధులు ఏలూరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :