ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : సోమవారం నాడు నందికొట్కూరు తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం తహాసిల్దార్ శ్రీనివాసులు కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి నందికొట్కూరు మండల కార్యదర్శి కాటేపోగు సామన్న. అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు పిక్కిలి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద.1.50,000 ఎన్టీఆర్.1.00000. మొత్తం రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని పట్టణంలో దాదాపు 400 మందికి గృహాల మంజూరయ్యాయని అయితే లబ్ధిదారులకు రిజిస్టర్ కాగితాలు గాని, పట్టా కాగితం గాని ఉంటేనే బిల్లు పడే పరిస్థితి ఉందన్నారు. అనేకమంది ఉమ్మడికుటుంబాల్లో ఉంటూ వారసత్వపు ఆస్తిని అగ్రిమెంట్ల ద్వారా అదేవిధంగా పట్టాలు లేని వాటికి అగ్రిమెంట్ల ద్వారా కొనుగోలు చేసి అనుభవం కింద ఉండి బేస్ మట్టం నిర్మించుకోవడం జరిగిందన్నారు. వీటిని పనులు తీసుకొని తహసిల్దార్ పొజిషన్ సర్టిఫికెట్ (అనుబంధం) మంజూరు చేయకపోతే బిల్లులో సాంక్షన్ అయ్యే పరిస్థితి ఉండదు అన్నారు. దీనివలన లబ్ధిదారులు ప్రైవేటు అప్పులకు అధిక వడ్డీలకు తీసుకువచ్చి ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుందని ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు ఏమాత్రం సరిపోక దాదాపు మూడు లక్షలపైనే పెట్టుకునే పరిస్థితి ఉందన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2017-2018. నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణంలో దాదాపు వేల గృహాలు మంజూరు అయ్యాయని అప్పట్లో ఉన్నటువంటి తహాసిల్దార్ అందరికీ పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంతో ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అన్నారు ప్రస్తుతము ఉన్నటువంటి తహాసిల్దార్ జినేన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించే పరిస్థితి ఉందన్నారు దీనివలన లబ్ధిదారులు అయోమయంలో పరిస్థితి ఉందన్నారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ లు జోక్యం చేసుకొని తహాసిల్దార్ తో మాట్లాడి అనుబంధ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే లబ్ధిదారులతో కలిసి తహాసిల్దార్ కార్యాలయం ముందు రిలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో. నందికొట్కూరు మండల కార్యదర్శి కాటపోగు.సామన్న, జూపాడు మండల కార్యదర్శి టి.నరసింహులు, చెరుకుచెర్ల.గాబ్రియల్, లింగాల శ్రీనివాసులు, ఎస్.మహబూబ్ బాషా, వడ్డే శివ నారాయణ, షికారి.మధు, షరీఫ్ భాష, మహిళా సంఘం నాయకురాలు & మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్.బిబిఎస్.ముర్తుజాబి, పి.మణికుమారి, ఎస్.రజియా, లబ్ధిదారులు షికారి శాంతి, షికారి.మధు, బేబీ, షికారి.ఈరమ్మ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News