Thursday, 30 July 2026 09:02:08 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష

Date : 14 January 2026 08:45 PM Views : 242

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామంలో టిడిపి యువ నాయకుడు & సమాజ సేవకుడు పి.హుసేన్ భాష ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పెద్దలతో కలిసి ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకుడు & సమాజ సేవకుడు పి.హుసేన్ భాష మాట్లాడుతూ గ్రామంలో రాజకీయాలకతీతంగా, కుల మతాలకతీతంగా, మతసామరస్యంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ - భాయ్ అని కలిసి వెలిసి ఉండడానికి నేను అన్ని మతాల పండుగల కార్యక్రమాలకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నానని అన్నారు. గ్రామంలో 14 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. ముత్యాల ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించిందన్నారు. గ్రామంలో నుంచి మహిళలు మధ్యాహ్నం 03 గంటలకే పోటీలు జరిగే దేవాలయం ప్రాంగణానికి పెద్దసంఖ్యలో మహిళలు చేరుకున్నారు.

మధ్యాహ్నం 03 గంటలకు ప్రారంభమైన పోటీలు మధ్యాహ్నం 6.30 గంటల వరకు కొనసాగాయన్నారు. కొందరు మహిళలు ఆలస్యంగా పోటీలకు హాజరైనప్పటికీ అందమైన ముగ్గులు వేయడం జరిగింది. ప్రతి ముగ్గూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణేతలు తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చిందన్నారు. సంక్రాంతి పండుగ శోభ అడుగడుగునా తాండవించిందన్నారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన శివమ్మ, విజయమ్మ, లావణ్య, స్పందన, సారిక, తదితర విజయతలకు సమాజ సేవకుడు పి.హుసేన్ భాష, గ్రామ పెద్దలతో కలిసి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి.రామస్వామి, మాజీ సర్పంచ్ రామసుబ్బయ్య, నారాయణ రెడ్డి, టిడిపి యువ నాయకులు పి.హుసేన్ భాష , బీజేపీ మండల అధ్యక్షులు రాయపాటి.మురళి మోహన్, ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ వేణుగోపాల్, పెద్దబి గౌడ్ , బుడ్డన్న గౌడ్, మల్లికార్జున, గ్రామ టెంపుల్ యూత్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :