ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామ సమీపాన తుడిచెర్ల, వేల్పనూరు కేసీ కెనాల్ లాకిన్స్ ల దగ్గర జరిగిన రైతుల మరియు ఎమ్మెల్యేల సమావేశంలో కౌలు రైతు బుద్దానగర్ గ్రామంకి చెందిన బీవీ.నాగేశ్వరావు, తదితర ప్రాంతాల రైతులు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మరియు నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు & పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ని సూపర్ ఎలినో ప్రభావం వలన వర్షాలు పడక పోవడంతో పంటలు వేసుకోలేని పరిస్థితి ఉన్నందున, ముందు డబ్బులు కట్టి కౌలు కి తీసుకున్న పొలాలకు భూ యజమానుల తో మాట్లాడి తమ డబ్బులను వెనిక్కీ ఇప్పించాలని కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి, గౌరు.చరితా రెడ్డి లు మాట్లాడుతూ ఖచ్చితంగా గ్రామ పెద్దలు, లీడర్లు కలిసి ఒక కమిటీగా ఏర్పడి న్యాయం చేస్తామని కౌలు రైతులకు భరోసా ఇచ్చారు. కౌలు రైతులు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపి, సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కే.సి.కెనాల్ డీసీ చైర్మన్ కట్ట.పరమేశ్వర రెడ్డి, టిడిపి మండల నాయకుడు మద్దూరు జి.తిమ్మారెడ్డి, ఎర్రగూడూరు చెల్లె.హరినాథ్ రెడ్డి, మండల మాండ్ర సేవాదళ్ నాయకుడు భావన రాము, రెండు నియోజకవర్గం రైతులు, నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News